Indian Movies Oscar Nominations 2023: ఆస్కార్‌కు మూడు భారతీయ సినిమాలు…ఈసారైనా
Indian Movies Nominated to Oscar 2023: ఏ ఆసియా చిత్రానికి రానటువంటి అవకాశం అవార్డు భారతీయ సినిమాకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన నాటు నాటు పాటకు అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి ఆసియా, తొలి భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరి విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ కేటగిరిలో తప్పకుండా ఆస్కార్ దక్కే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చారిత్రాత్మక చిత్రం భారీ విజయం సొంతం చేసుకున్నది. భారతీయ భాషలతో పాటు విదేశాల్లో కూడా ఈ మూవీ విజయం సాధించింది. ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూస చిత్రాలను పక్కనపెట్టి వినూత్నమైన కథలతో, సరికొత్త టెక్నాలజీతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.
స్వాతంత్ర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా భారత్‌ల భారీ వసూళ్లను సాధించింది. నాటు నాటు సాంగ్‌కు విదేశాల్లో సైతం పాపులర్ కావడంతో ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. కాగా, ఈ సినిమాతో పాటు శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఆల్ దట్ బ్రీత్ సినిమా డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కింద నామినేట్ అయింది. గాలిపటాల కారణంగా గాయపడిన పక్షులకు చికిత్స అందించడమే లక్ష్యంగా ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించారు.
పక్షులను రక్షించడం కోసం ఇద్దరు సోదరులు ఎలా కష్టపడ్డారు అనే అంశంతో ఈ ఫీచర్ ఫిల్మ్ రూపొందింది. ఢిల్లీ నేపథ్యంలో ఈ ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. కాగా, ఈ ఫీచర్ ఫిల్మ్ న్యూయార్క్‌లో జరిగిన 60వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విమర్శకులను సైతం ఆల్ దట్ బ్రీత్ ఫీచర్ ఫిల్మ్ ఆకట్టుకున్నది. విమర్శకుల మెప్పు పొందిన ఈ ఫీచర్ ఫిల్మ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరికి నామినేట్ అయింది. ఆల్ దట్ బ్రీత్ ఫీచర్ ఫిల్మ్‌కు తప్పకుండా ఆస్కార్ దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక భారత్ నుండి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌కు ఎంపిక చేయబడిన మరో ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పర్స్. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ను ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తికీ గోన్సాల్వెస్ రూపొందించాడు. అడవిలో వయసుమీద పడిన భార్యభర్తలకు ఓ ఏనుగు దొరుకుతుంది. ఆ గున్న ఏనుగును భార్య భర్తలు ఎలా పెంచారన్నతి ఇతివృత్తంగా కథ. ప్రకృతితో ముడిపడి ఉండటం, ఏనుగును కుటుంబంలో ఒకడిగా పెంచుకోవడం, ఏనుగు కూడా వారితో సఖ్యతగా ఉండటంతో ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.
40 నిమిషాలు నిడివి కలిగిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి విమర్శకుల మెప్పును పొందింది. కాగా, ఈ మూడు చిత్రాలు తప్పకుండా ఆస్కార్ విన్నర్లుగా నిలుస్తాయని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు. మూడు చిత్రాలు తప్పకుండా ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకోవాలని మనసావాచా మనం కూడా కోరుకుందాం.