Ibomma: మరోసారి షాక్ ఇచ్చిన ఐబొమ్మ
Ibomma Stopped Working In India: ఐ బొమ్మ అభిమానులకు మరోసారి షాకిచ్చింది. ఎటువంటి డబ్బులు కట్టకుండా మంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూసుకొనే వెసులుబాటు కలిగించడంతో ఐబొమ్మకు అభిమానులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఏ కొత్త సినిమా వచ్చినా సిరీస్ వచ్చినా.. మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ చేతులు ఐబొమ్మ మీదనే నిలుస్తాయి. ఇక తాజాగా అలాంటి ఐబొమ్మ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తమ సేవలను ఇక నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది కూడా ఇదే మాటను చెప్పుకొచ్చింది. అయితే అప్పుడు అభిమానులందరూ దయచేసి అలా చేయవద్దని బతిమిలాడడంతో కొన్నిరోజులలోనే మళ్లీ సేవలను తిరిగి కొనసాగించింది.
ఇక ఈసారి కనీసం చెప్పకుండా ఐబొమ్మ తమ సేవలను నిలిపివేసింది. సినిమా చూడడానికి ఐబొమ్మ సైట్ ఓపెన్ చేసినవారికి నిరాశ ఎదురయ్యింది. తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన కనిపించడంతో మరోసారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బు కోసం ఇదంతా చేయలేదని, దీనివలన ఒక్క రూపాయి ఆదాయం కూడా తమకు రాదని, కాకపోతే ముందు ముందు సర్వర్ డౌన్ లోడ్స్ కు ఖర్చుపెట్టే డబ్బు తమవద్ద లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరి ఈసారి శాశ్వతంగా నిలిపివేస్తారో..లేదో చూడాలి.