అప్ డేట్స్ అడిగితే సినిమాలు మానేస్తా : ఎన్టీఆర్
అభిమానం ఈ మధ్య హద్దులు దాటుతోంది. దాని వల్ల స్టార్ హీరోలు చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ టైగర్ కూడా తన ఫ్యాన్స్ వల్ల ఈమధ్య ఇబ్బందికర వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తరువాత ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నెలల తరబడి ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ అప్ డేట్స్ ఏంటని, ఎప్పటికీ సెట్స్ పైకి వెళుతుందంటూ అభిమానులు నెట్టింట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇదే ఎన్టీఆర్ ని అసహనానికి గురి చేస్తోంది.
కల్యాణ్ రామ్ నటించిన `అమిగోస్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అప్ డేట్స్ గురించి అగడగొద్దని, ప్రతీసారి అప్ డేట్ అప్ డేట్ అంటే చెప్పలేనని, ఎదైనా అప్ డేట్ వుంటే తన భార్య లక్ష్మీ ప్రణతి కంటే ముందే మీకే చెప్పేస్తానని కాస్త సీరియస్ గానే చెప్పారు. అయితే తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి తెరకెక్కించిన `దాస్ క ధమ్కీ` ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
30వ ప్రాజెక్ట్ గురించి మీరు అప్ డేట్ అడిగితే నేను ఆ సినిమా చేయడం లేదని చెబుతాను. అయినా సరే మళ్లీ మళ్లీ అప్ డేట్ అని విసిగిస్తే నేను సినిమా చేయడం మానేస్తా` అంటూ ఎన్టీఆర్ అభిమానులకు షాకిచ్చారు. నేను సినిమాలు చేయడం ఆపనని మీకూ తెలుసు. మీరు నన్ను సినిమాలు చేయకుండా ఆపలేరని మీకూ తెలుసు. అందుకే అప్ డేట్ ల గురించి మళ్లీ మళ్లీ అడగడం ఆపేయండి. కొరటాల శివతో చేయబోతున్న సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది` అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
ఇదిలా వుంటే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ కామెడీ డ్రామా `దాస్ క ధమ్కీ`. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విశ్వక్ సేన్ డ్యుయెల్ రోల్ లో నటించాడు. `ఓరి దేవుడా` మూవీ తరువాత తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై విశ్వక్ సేన్ భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాడట. యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీని మార్చి 22న విడుదల చేస్తున్నారు. విశ్వక్ సేన్ నమ్మకాన్ని `దాస్ క ధమ్కీ` ఎంత వరకు నిజం చేస్తుందో తెలియాలంటే మార్చి 22 వరకు వేచి చూడాల్సిందే.