Dimple Hayathi:నేను అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పుని కప్పి పుచ్చినట్లు ట్వీట్ చేసింది. నాకు డింపుల్‌కు వ్యక్తిగత గొడవలు లేవు.
Dimple Hayathi:వరుణ్‌తేజ్ హీరోగా, హరీష్ శంకర్ తెరకెక్కించిన `గద్దలకొండ గణేష్` మూవీతో లైమ్ లైట్లోకి వచ్చేసిన హాట్ లేడీ డింపుల్ హయాతి. మాస్ మహారాజా `ఖిలాడీ` చిత్రంతో టాలీవుడ్లో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల గోపీచంద్‌తో కలిసి `రామాబాణం` మూవీలో నటిచింది. అయితే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుంది. గ్లామర్ స్టార్‌గా పేరున్న డింపుల్ కు ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ ఆఫర్లే ఉన్నాయి. ఇదిలా ఉంటే హీరోయిన్గా ఇప్పటి వరకు సరైన బ్రేక్‌ని దక్కించుకోని డింపుల్ తాజాగా డీసీపీ రాహుల్ హెగ్డే వివాదంతో వార్తల్లో నిలిచింది.
జూబ్లీహిల్స్ హుడా ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్మెంట్లో స్నేహితుడు డేవిడ్‌తో పాటు కలిసి ఉంటున్న డింపుల్ కార్ పార్కింగ్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించి వార్తల్లో నిలిచింది. తాజా వివాదం కారనణంగా డింపుల్ పై పలు సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రాహుల్ హెగ్డే మీడియాకు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
నటి డింపుల్ నా అధికారిక వాహనాన్ని ఢీకొట్టింది. డింపుల్, నేను ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. నేను పార్క్ చేసే స్థలంలో నా కారుకు ఆమెఅడ్డు పెడుతోంది. నేను పోలీస్కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో నా అధికారిక వాహనానికి తన కారుని అడ్డుపెట్టి ఇబ్బందికి గురి చేస్తోంది. ఇదేమని అడిగే నా వాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా కాలుతో తన్నింది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి`అని తెలిపారు.
అంతే కాకుండా డింపుల్‌ను నేను వ్యక్తిగతంగా వెళ్లి రిక్వెస్ట్ చేశాను. అయినా ఆమె తీరు మారలేదు. దీంతో మా డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నేను అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పుని కప్పి పుచ్చినట్లు ట్వీట్ చేసింది. నాకు డింపుల్‌కు వ్యక్తిగత గొడవలు లేవు. ఆమె ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిజా నిజాలు త్వరలోనే తెలుస్తాయి. డింపుల్ కారుని కాలితో తన్నడం..డ్యామేజ్ చేయడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది. నిజా నిజాలు త్వరలోనే తెలుస్తాయి` అని తెలిపారు.
Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023