Hyper Aadhi: మనసులో ఉన్నది కక్కేస్తా.. 2024లో గాజు గ్లాసుపై నొక్కేస్తా
Hyper Aadhi Shocking Comments About Janasenani Pawan Kalyan: జనేసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం ఏదో ఒక సభను ఏర్పాటు చేసి తనదైన శైలిలో అధికార పార్టీని ఏకిపారేస్తున్నారు. ఇక నేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో “యువశక్తి” సభలో పవన్ ప్రసంగించారు. ఈ సభలో హైలైట్ గా నిలిచాడు జబర్దస్త్ నటుడు హైపర్ఆది . ఆదికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సార్లు పవన్ ను విమర్శించినవారిపై తన స్కిట్స్ లలో ఆది పంచ్ లు వేసి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చాడు. ఇక ఈ సభలో సైతం పంచ్ లు వేసి పవన్ ను నవ్వించాడు.
“పవన్ కళ్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను.. అనే మాట వినాలని ఉంది. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ.. ప్రశ్నించే హక్కు ఉంటుంది. గెలిచిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాదు.. లేదు.. అంటే.. మనసులో ఉన్నది కక్కేస్తా.. 2024లో గాజు గ్లాసుపై నొక్కేస్తా” అని డైలాగ్ లు వేశాడు. ఇక ఏపీ మంత్రులపై సెటైర్లు వేస్తూ మంత్రులకు శాఖలు ఎందుకు.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని, నూటయాబై మంది ఎమ్మెల్యేలు ఒక్కడికి భయపడుతున్నారని, ప్రతివాడు తన పాపులారిటీ కోసం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తున్నారని ఆనాడు. ఇక్కడికి వచ్చినవారు ఏ బీరు బాటిలో, బిర్యానీ కోసమో రాలేదని పవన్ మీద నమ్మకంతో వచ్చారన్నారు. నన్ను కన్న నాతల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. అలాంటి నీతిగల.. నిజాయితీగల నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడిని మీరు మళ్లీ చూడలేరని చెప్పుకొచ్చాడు.
“పవన్ రెండుచోట్ల ఓడిపోయాడు.. ఓడిపోయాడు అని అంటున్నారు. అరేయ్ ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు, బాధలు తీర్చారు.. ఇక గెలిస్తే.. వారి కష్టం కాంపౌండ్ వాల్ కూడా దాటదు. రికార్డులు కొల్లగొట్టడానికి సినిమాలు ఒప్పుకున్న హీరోలను మీరు చూశారు.. కానీ.. కౌలు రైతుల కష్టాలను తీర్చడం కోసం సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు.. కానీ ఏ వ్యాపారం లేని ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా” అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైపర్ ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.