James Caan: ‘గాడ్ ఫాదర్’ నటుడు మృతి
Actor James Caan Death: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు జరగడం ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలే స్టార్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించారు. అలాగే ఆర్.నారాయణ మూర్తి తల్లి, సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి, మొన్నటికి మొన్న సీనియర్ ఎడిటర్ గౌతంరాజు, నిన్న నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అల్లుకున్నాయి. ఇరాక్ తాజాగా హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్ మృతి చెందారు.
అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో నివాసం ఉంటున్న జేమ్స్ నేడు ఉదయం తుదిశ్వాస విడిచనట్లు ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. గాడ్ ఫాదర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జేమ్స్ ‘మిజరీ’, ‘ఎల్ఫ్’ వంటి చిత్రాలతో అలరించారు. సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. ఒకానొక టైంలో ఈయన ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యారు. జేమ్స్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.