Tiger Nageswara Rao:మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ పాన్ ఇండియా బయోపిక్ `టైగర్ నాగేశ్వరరావు`. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కృతిసనన్ సోదరి నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Tiger Nageswara Rao:మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ పాన్ ఇండియా బయోపిక్ `టైగర్ నాగేశ్వరరావు`. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కృతిసనన్ సోదరి నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్న ఈ సినిమాని స్టూవర్ట్ పురం గజదొంగగా పేరున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఈ సినిమా టీజర్‌ని ఇటీవలే విడుదల చేశారు. రవితేజ క్యారెక్టర్ని మలిచిన తీరు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితేదీనిపై తాజాగావివాదం మొదలైంది. టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు,డైలాగ్లుస్టూవర్ట్పురం వాసులని కించపరిచేవిగా ఉన్నాయని ఏపీ హైకోర్టు `టైగర్ నాగేశ్వరరావు` మేకర్స్‌పై అసహనాన్ని వ్యక్తం చేసింది. దృవ పత్రం లేకుండా టీజర్‌ని ఎలా రిలీజ్ చేస్తారంటూ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. టీజర్లో వాడిన పద ప్రయోగం ఓ వర్గాన్ని కించపరిచేదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
High Court Send Notice Tiger Nageswara Rao Movie Producer
సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా ఎలా టీజర్‌ని విడుదల చేస్తారని చిత్ర బృందాన్ని నిలదీసింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా? అంటూ మేకర్స్‌పై ఘాటుగా స్పందించింది. ఇలాంటి టీజర్‌తో సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే తగు వివరణ ఇవ్వాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్పర్సన్ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటీషనర్‌కు సూచించింది.
అభ్యంతరాలపై ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటీషనర్‌కు వెలుసుబాటు కల్పించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టీస్ శేష సాయి దర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సమాజిక వర్గాన్ని కించపరిచేదిగా ఉందని, స్టువర్ట్పురం గ్రామస్థుల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని చుక్కా పాల్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు అతని పిల్‌ని స్వీకరించి నిర్మాతకు నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.