హీరోయిన్ శర్వానంద్ వివాహాం( Sharwanand Marriage)ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్నవేళ రానే వచ్చింది.సినిమాలతో మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు హీరో శర్వా.
హీరోయిన్ శర్వానంద్ వివాహాం( Sharwanand Marriage)ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్నవేళ రానే వచ్చింది.సినిమాలతో మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు హీరో శర్వా. ఇక మన హీరో శర్వా (Sharwanand )పెళ్ళి రాజస్థాన్లోని లీలా ప్యాలెస్లో జూన్ 3న జేష్ట్య మాసం పౌర్ణమి రోజున పండితులు నిర్ణయించిన ముహూర్తాన పెళ్లి జరగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పెళ్లి కోసం… శర్వానంద్ ఫుల్ బిజీ అయ్యాడు. పెళ్లి వేడుకను ఘనంగా చేసుకునేందుకు కోట్లుఖర్చు చేస్తున్నాడు.టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. ఈయన నిశ్చితార్ధం జనవరిలో ఘనంగా జరిగింది. అయితే మధ్యలో ఈ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ.. శర్వానంద్.. రక్షితతో తన వివాహా తేదిని అధికారికంగా ప్రకటించాడు. మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆయన రక్షిత రెడ్డితో(Rakshita reddy) ఏడడుగులు వేయనున్నారు. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురైన రక్షితతో జనవరిలో శర్వానంద్ కి నిశ్చితార్థం జరిగింది.
జూన్ 2 కాని 3 తారీఖుల్లో శర్వానంద్ వివాహం. సాధారణంగా సెలెబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. శర్వానంద్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు. రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం జరుగుతుంది. ప్రముఖ లీలా ప్యాలస్(Leela mahal palace) శర్వానంద్ పెళ్లికి వేదిక జరగనుంది. లీలా ప్యాలస్ లో వేడుక చేసుకుంటే రోజుకు రూ. 4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అంటే రెండు రోజులకు రూ. 8 కోట్లు. ఇక విందు, వినోదాలు,దాండియా,తదితర ఏర్పాట్లకు మరికొంత ఖర్చు చేయనున్నారట. అంటే రూ. 10 కోట్ల వరకు శర్వానంద్ పెళ్లికి ఖర్చు చేస్తున్నాడని సమాచారం.తన పెళ్లి కోసం… శర్వానంద్ చేస్తున్న ఖర్చు అతని రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే. ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా ఈ పెళ్లిని శర్వానంద్ ప్లాన్ చేస్తున్నారట. శర్వానంద్ పేరుకే టైర్ టూ హీరో. సంపదలో మాత్రం స్టార్ హీరోలు కూడా సరిపోరు.