Sharwanand: ఫ్రెండ్ ఎంగేజ్ మెంట్ లో సందడి చేసిన రామ్ చరణ్ జంట
Hero Sharwanand Gets Engaged To Rakshita: టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత కొన్ని రోజులుగా శర్వా పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ నేడు శర్వా నిశ్చితార్థం అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దివంగత రాజకీయ నేత బొజ్జల గోపాల కృషారెడ్డి మనవరాలు.. హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షితా రెడ్డితో శర్వా ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. రక్షిత.. అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం గా తెలుస్తోంది. శర్వాకు సరైన జోడిగా రక్షిత కనిపిస్తోంది. ఇద్దరి జంట చూడముచ్చటగా కనిపిస్తోంది.
ఇక ఈ నిశ్చితార్థంలో మెగా జంట సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కలిసి ఈ వేడుకకు హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. శర్వానంద్, రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. ఒకే స్కూల్ లో వీరిద్దరూ చదువుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చరణ్ కు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో శర్వా ఒకడు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.