RRR: ఆస్కార్ కోసం అమెరికాకు బయల్దేరనున్న ఎన్టీఆర్..?
Hero Ntr Flying America For Oscar Event: టాలీవుడ్ ఒక్కటే కాదు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక.. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావాలని.. దానికోసం అభిమానులు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. దేశాన్ని దాటుకొని విదేశాల్లో ఒక తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మార్చి 12 న జరగబోయే ఈ ఆస్కార్ వేడుకల కోసం యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బృందం మొత్తం అమెరికాకు చేరుకున్నారు.. ఒక్క ఎన్టీఆర్ తప్ప. ఫిబ్రవరి 18న అన్నయ్య తారకరత్న కన్నుమూశారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్న విషయం తెల్సిందే.
ఇక మార్చి 2 న తారకరత్న దశదిన కార్యక్రమం ఉండడంతో తారక్ అమెరికా ప్రయాణం వాయిదా పడింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 6 అనగా రేపు తారక్ అమెరికాకు బయల్దేరనున్నట్లు సమాచారం. ఆస్కార్ వేడుక మార్చి 12న జరుగుతుంది. ఈ లోపు ఆయన హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చరణ్.. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశాడు. ఇక వచ్చేవారం మొత్తం తారక్ వంతు అని టాక్. మరి ఈసారి ఇంటర్వ్యూలలో తారక్ ఏం మాట్లాడతాడో చూడాలి.