jai bhim:విభిన్నమైన సినిమాలు, విలక్షణమైన కథలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన లీగల్ డ్రామా `జై భీమ్`. సామాజిక చైతన్యం ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
jai bhim:విభిన్నమైన సినిమాలు, విలక్షణమైన కథలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన లీగల్ డ్రామా `జై భీమ్`. సామాజిక చైతన్యం ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో తొలిసారి సూర్య పక్కా నేటివిటీతో సాగే పాత్రలో కనిపించిన అబ్బుర పరిచారు.
Has Suriya Jai Bheem Been Treated Unfairly In The National Awards
గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అడ్వకేట్ చంద్రూ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకులని సైతం మెప్పించి శభాష్ అనిపించింది. పోలీసుల అలసత్వం కారణంగా లాకప్ డెత్ కు గురైన ఓ గిరిజనుడికి న్యాయం జరగాలని అతని భార్య చినతల్ని చేసే న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచి ఆమెని గెలిపించే అడ్వకేట్ చంద్రూ పాత్రలో హీరో సూర్య నటించి తనదైన అద్భుతాభినయంతో ఆకట్టుకున్నారు. జాతీయ పురస్కారానికి అన్ని అర్హతలున్న ఈ సినిమాకు 69వ నేషనల్ అవార్డుల్లో మొండి చేయి చూపించారు.
ఒక్క విభాగంలోనూ ఈ సినిమాకు అవార్డు లభించకపోవడంతో అభిమానులు, నెటిజన్లు అవార్డు కమిటీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కుల వివక్ష కారణంగానే ఈ సినిమాకు అన్యాయం చేశారని మండిపడుతున్నారు. సామాజిక న్యాయం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ అత్యంత నేచురల్‌గా రూపొందించారు. దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టించి సంచలనంగా మారిన ఈ సినిమాలోని ప్రతీ ఒక్కరు అత్యంత సహజమైన నటనని ప్రదర్శించారు. అయితే ఏ ఒక్క విభాగంలోనూ ఈ సినిమాకు అవార్డులు దక్కకపోవడంతో అభిమానులు, నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.
ఇదే తరహాలో ధనుష్ నటించిన `కర్ణన్` సినిమాని కూడా ఏ ఒక్క అవార్డు వరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ రూపొందించిన సినిమా `కర్ణన్`. అనగారిన వర్గాలకు అండగా నిలిచే ఓ యువకుడిగా కథగా ఈ సినిమాని రూపొందించారు. ధనుష్ పాత్రకు అవార్డు లభిస్తుందని అంతా భావించారు. కానీ నేషనల్ అవార్డుల్లో `కర్ణన్` ఊసే ఎత్తకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తమిళ ప్రేక్షకులు `జై భీమ్`, కర్ణన్` సినిమాలని కుల వివక్ష కారణంగానే పక్కన పెట్టారని మండిపడుతున్నారు.