Samantha: సమంత చేతిలో కొత్తగా దాన్ని గమనించారా..?
Has Samantha Become Completely Spiritual:టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇక కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్న ఆమె ఇప్పుడిప్పుడే రికవరీ అయ్యి మీడియా ముందుకు వస్తోంది. తాజాగా నిన్న జరిగిన శాకుంతలం ట్రైలర్ లాం ఈవెంట్ కు విచ్చేసిన సామ్ ఎమోషనల్ అయ్యింది. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ముగ్దురాలు అయ్యింది. తన అభిమానులే తనకు బలమని, ఇంకా స్ట్రాంగ్ గా కావడానికి మీ అభిమానమే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. ఈ మధ్యలో సామ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఫేస్ మారడమే కాకుండా ఆమె అలవాట్లు కూడా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి.
ఎప్పుడు లేనిది సామ్ చేతిలో జపమాలతో కనిపిస్తోంది. అది ఎందుకు అంటే.. గత కొంత కాలంగా మయోసైటీస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న సామ్ మంచి ఆరోగ్యం మనశ్శాంతి కోసం జపం చేస్తోందట. మొదటి నుంచి సామ్, సద్గురు జగ్గీ వాసుదేవ్ ఫాలోవర్ గా ఉంటోంది. ఆయన సలహాతోనే సమంత ఈ జపం చేస్తుందట. ప్రతీ రోజు 10.008 శ్లోకాలు జపిస్తూ ఆథ్యత్మిక చింతనలో మనశ్శాంతిని వెతుకుంటున్నదట. సామ్ స్వతహాగా క్రిస్టియన్. అ ఇప్పుడు హిందూ మతాన్ని స్వీకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆమె ఆరోగ్యంగా ఉండి , మనశ్శాంతితో ఉంటే చాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు.