సినీ ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఇవన్నీ కామన్.
Unmarried Heroines : సినీ ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్(love breakup) పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఇవన్నీ కామన్. ఎన్నో సంవత్సరాల నుంచి డేటింగ్ లో ఉన్న వారిని సైతం సింపుల్ గా విడిచి పెట్టేస్తూ ఉంటారు. మరి కొంతమంది పదుల సంఖ్యలో వయసు మీద పడుతున్నా పెళ్లికి దూరంగా ఉంటారు.అలా ఇండస్ట్రీలో 35 సంవత్సరాలు దాటిన పెళ్లికాని హీరోయిన్లు(35 age herions) చాలామంది ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరంటే..? టాలీవుడ్లో పెళ్లి కాని ప్రసాదులు చారెడుంటే.. మ్యారేజ్ చేసుకొని కుమారిల లిస్టు కూడా బారెడు ఉంది.. కాలంతో పాటు వయసు వేగంగా మళ్లుతున్నా.. కెరీర్ ఇంపార్టెంట్.. పెళ్లి పిచ్చ లైట్ అంటున్నారు ఈ అందమైన భామలు..
2022లో ఎలాగోలా నయనతార(nayanathara) వంటి కొంత మంది హీరోయిన్లు పెళ్లి పీఠలు ఎక్కారు. ఈ యేడాది కియారా అద్వానీ.. సిద్ధార్ధ్ మల్హోత్రను పెళ్లాడి మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టింది. కానీ ఇంకా చాలా మంది హీరోయిన్లు పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయారు. ఈ రోజుల్లో అమ్మాయికి పాతికేళ్లు వచ్చాయంటే పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. కానీ మన హీరోయిన్లు మాత్రం 30 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పెళ్లి గిల్లీ లేదంటూ కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నారు
అనుష్క
తొలిచిత్రం సూపర్(super movie) ..విడుదలయ్యేటప్పుడు పాతికేళ్ళు. (Anushka)అంటే ఒకప్పటికి కథనాయకులు విరామం తీసుకునేది ఏజ్. అయితేనేం నాలుగేళ్ళ తరువాత వచ్చిన అరుంధతి (Arundhati) లో కథానాయక ప్రాధాన్యత సినిమాలకి కేరాఫ్ గా మారింది. సైజ్ జీరో,రుద్రమదేవి,భాగమతి వంటివి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. బాహుబలిలో(Bahubali) దేవసేనగా దేశాన్ని మెప్పించింది. త్వరలోనే కుర్ర హీరో నవీన్ పోలీశెట్టి(navven polishetty) తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లో(miss shetty mister polishetty) ప్రయోగాత్మక పాత్రలో అలంరించబోతుంది. కాస్త రిస్క్ వున్నా సరే ఇలాంటి ప్రయోగాల వలన ఇండస్ట్రీలో తాను వున్నంతకాలం నిలబడగలిగానని చెబుతోంది. ఓ దశ తర్వాత కొత్త కథల కోసం వెతకడం ఒక్కటే. కథల్లోని వైవిధ్య పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను మలుచుకున్నాను. కొత్త విషయాలు నేర్చుకున్నాను. వాటిలో పడి నావయసు మరిచిపోయా అంటుంది.
త్రిష
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సీనియర్ హీరోయిన్ లలో త్రిష(trisha) కూడా ఒకరు. దాదాపు ఈమె రెండు దశాబ్దాల కెరీర్లో తమిళ, తెలుగు లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది ముద్దుగుమ్మ. అయితే పెళ్లికి మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ లలో త్రిష(trisha) పేరు ముందే ఉంటుంది. ఇప్పటి వరకు ఈమె పెళ్లి చేసుకోలేదు. గతంలో వరుణ్ అనే వ్యక్తి తో అమ్మడి నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. గతంలో రానా తో కూడా త్రిష ప్రేమ లో ఉందని వార్తలు వినిపించాయి కానీ వాళ్ళు కూడా పెళ్లి దాకా వెళ్ళలేదు.తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన త్రిష.. అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. చాలా కాలాం తర్వాత 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో(ponniyin selvan) యువరాణి కుందవై పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో పాల్గోన్న ఈ బ్యూటీ మరింత అందంగా కనిపించింది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఇక తెరపైకి మరోసారి త్రిష పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పటివరకు అమ్మడు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
తమన్నా
సౌత్ చిత్ర పరిశ్రమలోనే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా(tamanna) చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమ్ము.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను అందుకుంది. చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో తమన్నా నటించింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ హీరోలతో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. గత కొంతకాలంగా తమన్నా బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈ ఇద్దరూ పబ్లిక్ గానే చేతులో చేయి వేసుకొని చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నారు. ఇదే సమయంలో రీసెంట్గా అమ్మడి బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన ‘దహద్’ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆ ఇంటర్వ్యూలో తమ్ము తో ఎఫైర్ గురించి లైవ్ లోనే అడిగేశారు. అదే సమయంలో విజయ్‌వర్మ ఏమీ చెప్పలేక సిగ్గుతో అవుననే ఆన్సర్ ఇచ్చేశాడు. కాని ఇంకా పెళ్ళి పై క్లారిటి ఇవ్వలేదు .ఈ సారైనా పెళ్లి పీఠలు ఎక్కుతుందా..?
పూజా హెగ్డే
పూజా హెగ్డే (pooja hegde)బిజీబిజీగా ఉంటోంది. హిట్,ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలట. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే చెబుతున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) కెరీర్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. కిందటి ఏడాది డిజాస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ తో ఫ్లాప్ అందుకుంది. బాలీవుడ్(Bollywood) లో మరికొన్ని సినిమాలు చేస్తోంది. షాహిద్ కపూర్ సరసన కోయి సాక్ మూవీలో నటిస్తోంది. ఇక తెలుగులో మహేష్-త్రివిక్రమ్ తో SSMB28 క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది.మహేశ్ బాబుతో సినిమా చేస్తోంది. పూజా హెగ్డే.. మహేష్ బాబుతో(Pooja Hegde-Mahesh babu) కలిసి ఇప్పటికే మహర్షి సినిమాలో నటించింది. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న SSMB28లోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో పూజాతో పాటు సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్గా చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
శృతి హాసన్
శ్రుతి హాసన్(shruti haasan) జీవితంలో ప్రేమ కథలు తక్కువేమీ కాదు. ఫోటోగ్రాఫర్, హీరో సిద్దార్థ్ ఇలా ఇద్దరితో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టేసింది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్‌తో అయితే శ్రుతి హాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగింది. అతగాడి కోసం సినిమా కెరీర్‌ను కూడా పక్కన పెట్టేసింది. అయితే అతను తనను కంట్రోల్ చేయాలని చూశాడని, అందుకే బ్రేకప్ చెప్పేశానంటూ అమ్మడు చెప్పింది. ఆ తరువాత వెంటనే శ్రుతి హాసన్ ప్రేమలో పడింది. శంతను హజారికాతో డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. గత కొన్ని ఏళ్లుగా శంతను, శ్రుతి హాసన్ లివ్ ఇన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముంబైలోనే ఈ ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. కరోనా సమయంలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందా? లేదా? పెళ్ళంటే భయమంటోంది స్టార్ హీరోయిన్ శృతి హాసన్(shruti haasan). పెళ్ళి మీద భయం పెరగడానికి కారణం కూడా చెపుతోంది. ప్రియుడితో సహజీవనం చేస్తున్న శ్రుతి.. పెళ్లి విషయంలో మాత్రం వేనకడుగు వేస్తోంది. కమల్ హాసన్ (kamalhasan)వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా…తన సొంత టాలెంట్ మీద.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది శ్రుతి . హీరోయిన్ గా మాత్రమే కాకుండా మల్టీ టాలెంట్ చూపిస్తుంది . మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోయిన్ గా, సింగర్‌గా.. ఇలా అన్ని రంగాల్లోనూ తన సత్తా చాటుకుంది.
తాప్సీ పన్ను
టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను(taapsee pannu)ఈ మధ్యకాలంలో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. పర్ఫామెన్స్ కి ప్రాధాన్యత ఉండే పాత్రలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకుపోతుంది ఈ భామ. అయితే గత కొంత కాలంగా తాప్సీ ఒక ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో అనే వ్యక్తి తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి పలు సార్లు వెకేషన్ కు వెళ్లి కెమెరా కంటికి కూడా చిక్కారు. కానీ వీరిద్దరు అధికారికంగా దీని గురించి ప్రకటించలేదు.బాలీవుడ్లో సత్తా చాటుతున్న తాప్సీ పన్ను ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా వెలుగొందింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తాప్సీకి ఇక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడే తన యాక్టింగ్‌కు మరింత పదును పెడుతూ వుమెన్ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ సత్తా చాటుతోంది.
రకుల్ ప్రతి సింగ్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh). ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు అరడజను పైగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇక అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ యాపిల్ బ్యూటీ. జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది. ఇక అప్పట్నుంచి మీడియా, అభిమానులు, నెటిజన్లు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతూనే ఉన్నారు.మొదట్లో ఈ ప్రశ్న అడిగిన ప్రతి సారి ఇప్పుడే చేసుకోము, చేసుకుంటే చెప్తాము అంటూ సమాధానాలిచ్చేది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సారి కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది రకుల్. మరి ఈ అమ్మడు పెళ్ళి పీఠలు ఎప్పుడు ఎక్కేది అంటే ప్రశ్నిస్తున్నారు.
నిత్యా మీనన్
హీరోయిన్ నిత్యా మీనన్ (nithya menon)వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు సినిమాలతో పాటు సిరీస్ లు, ఓటీటీలో సినిమాలు కూడా చేస్తుంది. వండర్ వుమెన్ అనే ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది నిత్యా. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో విడుదలయింది. ఇందులో నిత్యా ప్రెగ్నెంట్ వుమెన్ గా నటించింది. 34 ఏళ్ళు వచ్చినా నిత్యా పెళ్లి గురించి మాట్లాడట్లేదు. గత కొన్ని రోజుల క్రితం మలయాళ యూట్యూబర్ తో నిత్యా పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి, దీనిపై సీరియస్ గానే స్పందించింది. నిత్యా పెళ్లి గురించి మాట్లాడుతూ.. ”నేను పక్కా ట్రెడిషినల్ అమ్మాయిని. మన కల్చర్, సంప్రదాయాలని గౌరవిస్తాను. పెళ్లంటే ఒక సోషల్, ఫైనాన్సియల్ సెటప్. అలాంటివాటితో పెళ్లి ముడిపడి ఉంది. నాకు అలాంటి సెటప్ కోసం అయితే పెళ్లి అవసరం లేదు. ఎవరైనా అబ్బాయి దానికి మించి ఆలోచించేవాళ్ళు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను” అని తెలిపింది. మరి నిత్యా కావాలనుకునేలా ఆలోచించే అబ్బాయి ఎప్పుడు దొరుకుతాడో.
కృతి కర్బంధా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమాలో నటించిన భామ కృతి కర్బందా(kriti kharbanda). సుమంత్ హీరోగా రమణ గోగుల నిర్మించిన బోణీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. పవర్ స్టార్ సినిమా చేసినా సరే హిట్టు పడలేదు అంటే అమ్మడి బ్యాడ్ లక్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ లో పని అవదని గుర్తించిన ఈ బ్యూటీ చిన్నగా బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా సోసోగానే కెరియర్ సాగిస్తుంది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కృతికి హిందిలో అవకాశాలు మాత్రం వస్తున్నాయి. 4 సినిమాలో నటించిన అమ్మడు బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
అంజలి
కోలీవుడ్ లో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయి అంజలి(anjali). 2006లో విడుదలైన తెలుగు చిత్రం ఫోటోతో వెండితెరకు పరిచయమయ్యారు. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రాలేదు. అదే సమయంలో కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. అక్కడ టైర్ టూ హీరోయిన్ గా బిజీ అయింది. వరుసగా.అనేక తమిళ చిత్రాల్లో నటించింది. చాలా గ్యాప్ తర్వాత అంజలిని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మన పరిశ్రమకు తీసుకొచ్చాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించారు. ఆమె మహేష్, వెంకటేష్ మేనత్త కూతురు పాత్ర చేశారు.రాజోలుకు చెందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఒదిగిపోయారు. ఆ మూవీలో అంజలి నటన సహజంగా ఉంటుంది. ఆ చిత్రం సక్సెస్ సాధించడంతో అంజలికి తెలుగులో ఆఫర్స్ మొదలయ్యాయి. రవితేజకు జంటగా బలుపు చిత్రం చేసింది. బలుపు సూపర్ హిట్ అందుకుంది. అలాగే మసాలా మూవీలో మరోసారి వెంకటేష్ కి జంటగా నటించారు.మరి అమ్మడు పెళ్ళి పీఠలు ఎక్కబోయేది ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.