Hanu raghavapudi:టాలీవుడ్లో పాన్ ఇండియా(Pan India) సినిమాల పరంపర కొనసాగుతోంది. ఏ స్థార్ హీరోని కదిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా.
Hanu raghavapudi:టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల పరంపర కొనసాగుతోంది. ఏ స్థార్ హీరోని కదిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. తాజాగా మరో పాన్ ఇండియా మూవీకి క్రేజీ డైరెక్టర్, పాన్ ఇండాఇయా స్టార్ శ్రీకారం చుట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..దుల్కన్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన పీరియాడిక్ ఫిక్షనల్ మూవీ `సీతారామం`. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై సి. అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు.
మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఇండియన్ సోల్జర్ లెఫ్టినెంట్ రామ్‌ని ప్రేమించే రాజకుమారి కథగా ఈ మూవీని ఓ అందమైన దృశ్య కావ్యంగా తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఆగస్టులో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విమర్శలకు ప్రశంసల్ని సొంతంచ చేసుకునియ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. దర్శకుడిగా హను రాఘవపూడిని మరింత పాపులర్ చేసింది.
ఈ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు?.. ఏ నేపథ్యంలో ఆయన సినిమా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మళ్లీ పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీతో హను రాఘవపూడి ఓ భారీ పాన్ ఇండియా మూవీకి కశ్రీకారం చుట్టబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది నేచురల్ స్టార్ నానితో ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజా వార్తల ప్రకారం హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ని చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఇటీవలే హీరో ప్రభాస్‌కు దర్శకుడు హను రాఘవపూడి కథ వినిపించారని, ప్రభాస్‌కు కథ బాగా నచ్చిందని, ఇద్దరు కలిసి త్వరలో ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించే అవకాశం ఉందట. ప్రస్తుతం దీనకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో హను రాఘవపూడి బిజీగా ఉన్నారట. ఈ భారీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల `సీతారామం` వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన హను ఈ సారి ప్రభాస్‌తో యాక్షన్ ఎంటర్ టైనర్‌ని తెరపైకి తీసుకురానున్నారట.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన `ఆదిపురుష్` జూన్ 16న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న `సలార్` సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇక మారుతి డైరెక్షన్లో చేస్తున్న ఆసినిమా కూడా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న `ప్రాజెక్ట్ కె`వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.