#BoyapatiRAPO:ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ `ఇస్మార్ట్ శంకర్`(Ismart shankar) బ్లాక్ బస్టర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా హీరోగా రామ్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.
#BoyapatiRAPO:ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ `ఇస్మార్ట్ శంకర్`(Ismart shankar)బ్లాక్ బస్టర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా హీరోగా రామ్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతే కాకుండా అతని కెరీర్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ తరువాత వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న రామ్ ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం `ఫస్ట్ థండర్` పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయాల్సి ఉంది. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్.., అంతకు మించిన ఎనర్జీతో యాక్షన్ సినిమాలని తెరకెక్కించే బోయపాటి శ్రీనుల తొలి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్‌తో సినిమా ఉంటుందని ఫస్ట్ గ్లింప్స్ స్పష్టతనిచ్చింది. `ఫస్ట్ థండర్` పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌లో రామ్ చెప్పిన `నీ స్టేట్ దాటలేనన్నావ్..దాటా.. నీ గేట్ దాటలేనన్నావ్.. దాటా.. నీ పవర్ దాటలేనన్నావ్..దాటా..ఇంకేంటి దాటేది నా బొ..లిమిట్స్` అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. గ్లింప్స్ కు అబిమానులు, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసిన రామ్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేశారు.
తన బర్త్‌డే సందర్భంగా తనకు అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. అది నెట్టింట వైరల్ గా మారింది. `నా ప్రియమైన అభిమానులారా..మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు #BoyapatiRAPO గ్లింప్స్‌ని ఎంతగానో ఆస్వాదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. చూడటానికి సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి` అని ట్వీట్ చేశారు. రామ్, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thanking Every Single One my colleagues & well-wishers in the industry for your kind wishes on my birthday.. it means a lot ..🙏
My Dearest Fans, thank you for all the love you shower upon me..truly blessed as always..❤️
Extremely happy to see everyone enjoying the…
— RAm POthineni (@ramsayz) May 16, 2023