Adivi Sesh Major:విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. తనదైన మార్కు స్క్రిప్ట్‌లని ఎంచుకుంటూ కొత్త తరహా సినిమాలని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Adivi Sesh Major:విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. తనదైన మార్కు స్క్రిప్ట్‌లని ఎంచుకుంటూ కొత్త తరహా సినిమాలని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాను నటించిన సినిమాలకు రైటర్‌గానూ వ్యవహరిస్తూ ఆయా సినిమాలతో వరుస విజయాల్ని దక్కించుకుంటున్నారు. ఇటీవల సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం `మేజర్`. అడివిశేష్ హీరోగా నటించి, కథ అందించారు.
స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహిరంచిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొంది తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రూ.32 కోట్లతో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 60 నుంచి రూ.70 కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది.
గత ఏడాది మే 22న విడుదలైన ఈ సినిమాపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో నటించిన హీరో అడివి శేష్‌ని ప్రత్యేకంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. `గౌరవ నీయులైన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జీతో ప్రత్యేకంగా సమావేశం కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను` అన్నారు.
నిజంగా ఆయన చూపించిన స్పందన చూసి మేజర్ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని మర్చిపోయాం. ఆయనతో జరిపిన సంభాషణ జీవితాంతం గుర్తుంటుంది. మరి కొన్ని రోజుల్లో `మేజర్` రిలీజ్ అయి ఏడాది పూర్తి కానుంది. అయినప్పటికీ మేజర్ టీమ్‌కు ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి` అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో కలిసి ఉన్న వీడియో, ఫొటోలని అభిమానులతో పంచుకున్నారు.
Had the privilege of meeting with the Honourable Former President Sri Ram Nath Kovindji.
I am truly Overwhelmed by his response to our efforts on Major. It was a lovely conversation. Memories of a lifetime.
It’s going to be #MAJOR ‘s first anniversary in a few days and… pic.twitter.com/nlxx0nEObv
— Adivi Sesh (@AdiviSesh) May 16, 2023