ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబో వస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబో వస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండేళ్లుగా బన్నీ.. పుష్ప 2 కోసమే కష్టపడుతున్నాడు. కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో శరవేగంగా సాగుతోంది. అక్కడ ప్రస్తుత షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన ఛేజింగ్స్ సీన్స్ ను రూపొందిస్తోన్నారు. ఇక ఈ షూటింగ్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ పాల్గొన్నాడు. పుష్ప లో ఫహద్.. భన్వర్ సింగ్ శెకావత్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే. క్క్లైమాక్స్ లో బన్నీ- ఫహద్ మధ్య సీన్స్ అయితే ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఇక మొదటి భాగానికి మించి రెండో భాగం ఉండనుంది. ఇందులో పుష్ప మీద రివెంజ్ కోసం భన్వర్ సింగ్ శెకావత్ ఎంత క్రూరంగా మారాడు అనేది చూపించనున్నాడు. ఇక తాజా షెడ్యూల్లో ఫహాద్ ఫాజిల్ తన పార్టును పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఫహద్, సుకుమార్ సీన్ అయ్యాక మానిటర్ లో చూస్తున్నట్లు కనిపించారు. ” పుష్పరాజ్ ను వేటాడేందుకు భన్వర్ సింగ్ శెకావత్ వర్క్ చేస్తున్నాడు. పుష్ప 2లో ఫహాద్ కీలక పార్టును పూర్తి చేసుకున్నారు. ఈ సారి పుష్ప – శెకావత్ మధ్య వార్ ను చూసేందుకు వేచి చూడలేకపోతున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.