‘డ్రైవర్ జమున’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన దిల్ రాజు
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డ్రైవర్ జమున’. ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్య రాజేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించడానికి రెడీ అయ్యింది. కిన్ స్లిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 18 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. పోస్టర్ ఆసక్తిగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ జమున గా ఐశ్వర్య నటిస్తోంది. ఒక లేడీ క్యాబ్ డ్రైవర్ చుట్టు ఒక రోజు జరిగిన ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పోస్టర్ లో సైతం రక్తమోడిన ముఖంతో టీ తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించింది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో ఐశ్వర్య మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.