Director Teja:యంగ్ హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆయన మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని సంచలన దర్శకుడు తేజ(Director Teja) ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో చెబుతూ వస్తున్నారు. తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు.
Director Teja:యంగ్ హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆయన మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని సంచలన దర్శకుడు తేజ(Director Teja) ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో చెబుతూ వస్తున్నారు. తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఉదయ్ కిరణ్ డెత్ వెనక మిస్టరీ ఉందని ఇండైరెకక్ట్గా హింట్ ఇస్తున్నారు. తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ మృతిపై దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. తేజ రూపొందించిన లేటెస్ట్ మూవీ `అహింస`. జూన్ 2న విడుదల కానుంది.
ఈ సినిమా ద్వారా డి. సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి చాలా మందికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారని మండిపడ్డారు.
తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయనని ప్రశ్నించిన యాంకర్ ఉదయ్ కిరణ్ డెత్ వెనకున్న మిస్టరీ గురించి చెప్పమని అడగడంతో తేజ పై విధంగా స్పందించారు. `దాని గురించి నేను చెబుతాను. కానీ కొందరు మాత్రం `మీరే చెప్పండి` అని అమాయకంగా నటిస్తున్నారు` అని సమాధానమిచ్చారు. ఇక ఉదయ్ కిరణ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అని అడిగితే `పాపం` అన్నారు. ప్రస్తుతం దర్శకుడు తేజ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గత ఏడాది కూడా తేజ దివంగత నటుడు, యంగ్ హీరో ఉదయ్ కిరణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తనకు తెలుసని, తను ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారని తెలిపారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఆ ధైర్యం లేదని చెప్పిన తేజ తాను చనిపోయేలోపు ఏదో ఒక సమయంలో ఆ విషయాన్ని బయటపెడతానని తెలిపారు.