దగ్గుబాటి అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు డైరెక్టర్ తేజ. ఈ సినిమా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
దగ్గుబాటి అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు డైరెక్టర్ తేజ. ఈ సినిమా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతుండడటంతో వరుస ప్రమోషన్స్ తో బిజీగా మారారు చిత్రబృందం.కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో తన వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చే విషయాన్ని వెల్లడించాడు తేజ. తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నానని, తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందని.. అందుకే విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేస్తున్నాడని అన్నాడు. తను చూడటానికి అందంగా ఉంటాడు. అయితే హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా అని చెప్పుకొచ్చాడు తేజ. ఆయన ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను పరిచయం చేశాడు.
ప్రస్తుతం వారిలో చాలామంది స్టార్లుగా మారారు. . తేజ సినిమా అంటే అది లవ్ స్టోరీనే పక్కా అని ఫిక్స్ అయ్యేలా ప్రతి ప్రేమకథతో ప్రేక్షకుల మనసును గెలిచిన ఆయన తన కొడుకు సినిమాకు తానే డైరెక్టర్ గా ఉంటాడా అనేది మాత్రం చెప్పలేదు. ఇక తేజ వ్యాఖ్యలు విన్న అభిమానులు.. చాలామంది స్టార్స్, డైరెక్టర్స్.. తమ వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కానీ, హిట్లు మాత్రం అందించలేకపోయారు. మీరు అయినా కొడుకును హీరోగా నిలబెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తేజ.. తన కొడుకును హీరోగా నిలబెట్టగలడా..? లేదా ..? అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.