Rajamouli New Role: ఎన్నికల ప్రచార కర్తగా రాజమౌళి…ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా
SS Rajamouli appointed as election icon of Raichur: ఈ ఏడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. త్వరలోనే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయబోతున్నది. కాగా, ఎన్నికల శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కాగా, కర్ణాటకలోని రాయచూరు జిల్లా అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో చర్చించారు.
ఆయన్ను జిల్లా ఎన్నికల ప్రచార కర్తగా నియమించాలని నిర్ణయించారు. రాజమౌళి కూడా జిల్లా అధికారుల ప్రతిపాదనలకు ఒకే చెప్పడంతో ఈ ప్రతిపాదనల అంశాన్ని, రాజమౌళి పేరును ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోనే రాజమౌళి జన్మించారు. దేశంలో ప్రముఖ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన దర్శకత్వం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌కు బరిలో నిలిచింది. రాజమౌళి ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరస్తే తప్పకుండా ఓటింగ్ శాతంపెరుగుతుందని జిల్లా అధికారులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. రాజమౌళికూడా జిల్లా అధికారుల ప్రతిపాదనలకు ఓకే చెప్పడంతో అందరి దృష్టి రాయచూర్ జిల్లాపైనే ఉన్నది.