టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీసమస్యతో బాధపడుతున్నఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డైరెక్టర్ కె.ప్రత్యగాత్మ కుమారుడే కె. వాసు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీసమస్యతో బాధపడుతున్నఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డైరెక్టర్ కె.ప్రత్యగాత్మ కుమారుడే కె. వాసు. ఆయన అసలు పేరు కొల్లి శ్రీనివాసరావు. దాదాపు టాలీవుడ్ లో 27 సినిమాలకు దర్శకత్వం వహించి మంచి హిట్లను టాలీవుడ్ కు అందించారు. చిరంజీవిని హీరోగా చేసింది వాసునే. ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించింది కె. వాసునే. ఈ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో చిరు మూడు, నాలుగు సినిమాలు చేశాడు. స్టార్ హీరోలతో కూడా కె. వాసు సినిమాలు చేశాడు.
2014 లో శ్రీకాంత్, ప్రభుదేవా నటించిన ఇంట్లో శ్రీమతి.. వీధిలో కుమారి, 2008 లో గజిబిజి అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. అదే ఆయన చివరి చిత్రం. మొదట తండ్రి వద్దనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన.. తన 22 ఏళ్ళ వయస్సులోనే ఆడపిల్లల తండ్రి అనే సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించి షాక్ ఇచ్చారు. 1982లో రత్నకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి అన్నపూర్ణ, దీప్తి అనే అమ్మాయిలు. వాసు మృతి వార్త తెలియడంతోనే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.