Director Bobby: వాల్తేరు వీరయ్య టైటిల్ పెట్టడానికి అదే కారణం..
Director Bobby Talking About Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక మెగా అభిమాని మెగాస్టార్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య ఆలా ఉంటుందని బాంబై చెప్పుకొచ్చాడు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచిన మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా గురించి బాబీ మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. “వెంకీ మామ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో వున్నప్పుడు చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బావుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం” అని చెప్పుకొచ్చాడు. అంటే టైటిల్ కు చిరుకు దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో బాబీ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.