Dimple Hayathi:తనపై కేసు నమోదు కావడంతో అసహనానికి గురైన డింపుల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Dimple Hayathi:టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై తాజాగా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు ఆయన కారుని కాలితో తన్ని మరీ నానా హంగామా చేయడం సంచలనంగా మారింది. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఓన్క్లేవ్లో తాజా సంఘటన చోటు చేసుకుంది. హుడా కాలనీలో తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి అపార్ట్మెంట్లో ఉంటోంది డింపుల్ హయాతి.
ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్న డీసీపీ రాహుల్ హెగ్డే పార్కింగ్ స్థలాన్నిఅ క్రమంగడా వాడుకుంటూ ఆయనకు కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పార్కింగ్ స్థలంలో ఉన్న వస్తువులని తొలగించడం, ఆయన కారుని కాలితో తన్నడం వంటివి డింపుల్, ఆమె స్నేహితుడు డేవిడ్ చేస్తున్నారు. ఈ విషయంపై నిలదీసిన డ్రైవర్‌పై కూడా డింపుల్ గొడవకు దిగడంతో విషయం పోలీస్టేషన్ వరకు వెళ్లింది. పలు మార్లు డీసీపీ రిక్వెస్ట్ చేసినా డింపుల్ పద్దతి మార్చుకోకపోవడంతో ఆయన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో డింపుల్‌తో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై క్రిమినల్ కేసులతో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుని కూడా నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తనపై కేసు నమోదు కావడంతో అసహనానికి గురైన డింపుల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. `అధికార దుర్వినియోగంతో తప్పులను కప్పిపుచ్చలేరు. అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు దాగదు` అంటూ వెకిలిగా నవ్వుతున్న ఎమోజీలని పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఈ వ్యాఖ్యలకు #satyamevajayathe అనే హ్యాష్ ట్యాగ్‌ని జోడించింది. ప్రస్తుతం డింపుల్ పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023