Dil Raju: అందరు నా మీద పడి ఏడుస్తున్నారు.. అందుకే వారసుడు వాయిదా
Dil Raju Sensational Cooments At Varasudu Press Meet: ఎట్టకేలకు తెలుగు నిర్మాతలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఎంత పోరాడినా చివరకు దిల్ రాజు వెనక్కి తగ్గక తప్పలేదు. అధికారికంగా తన సినిమా వాయిదా పడినట్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడం కోసం ఆయన పడిన పాట్లు అంతా ఇంతా కాదు. నిర్మాత మండలి సంకాంతి పోటీలో డబ్బింగ్ సినిమాలు ఉండకూడదని చెప్పినా వారి మాటను పట్టించుకోకుండా దిల్ రాజు.. జనవరి 11 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ సినిమా, దిల్ రాజు పై నిర్మాతలు గుర్రుగా ఉన్నారు.
సంక్రాంతి బరిలో అప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా తన సినిమా వారసుడు కు ఎక్కువ థియేటర్లను లాక్ చేసినట్లు దిల్ రాజు పియా విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఎవరరు ఎన్ని అనుకున్నా తగ్గేదేలే అని దిల్ రాజు వారసుడు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. అందరు తన మీద పది ఏడుస్తున్నారని, తాను ఎన్నో సినిమాలు నష్టపోయానని, ఆ సమయంలో మరొక నిర్మాత అయితే ఆత్మహత్య చేసుకొనేవాడనని చెప్పి షాక్ ఇచ్చాడు. ఏది ఏమైనా దిల్ రాజు ధైర్యానికి ఇండస్ట్రీ మొత్తం అవాక్కయ్యింది. ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్ గా దిల్ రాజు వెనక్కి తగ్గాడు. తమిళ్ లో వరిసు యథాతధంగా జనవరి 11 న వస్తున్నా.. తెలుగులో మాత్రం వారసుడు రెండు రోజులు వెనక్కి వెళ్లి జనవరి 14 న వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. సడెన్ గా దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన శక్తులే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలే చేశాడు. ” మా సినిమా వారసుడు తెలుగులో 14 న విడుదల కానుంది.. తమిళ్ లో మాత్రం యథావిధిగా జనవరి 11 నే రిలీజ్ కానుంది. తెలుగు సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందుకే నేనే వెనక్కి తగ్గాను. నాకు డబ్బు కన్నా, ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వడమే ముఖ్యమని చాలా సార్లు చెప్పాను. నిర్మాతలందరూ బావుండాలి. నా మీదనే అందరు పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నా.. నాకు చిరంజీవి, బాలకృష్ణనే ముఖ్యం. మా సినిమా మీద నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు వచ్చినా విజయం అందుకుంటుంది. అన్ని సినిమాలు విజయాన్ని అందుకోవాలి. ఇండస్ట్రీ బావుండాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.