Vijay: ఇళయదళపతి చంకనెక్కిన దిల్ రాజు మనవరాలు
Dil Raju Granddaughter With Vijay Thalapathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. దిల్ రాజు నిర్మించినఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి తమిళ్ లో మంచి విజయాన్ని అందుకోగా తెలుగులో మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఇక ఎంత యావరేజ్ టాక్ తెచ్చుకున్న కలక్షన్స్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ ను చేరుకొని
ఆశ్చర్యపరుస్తోంది. ఇక తాజాగా వరిసు రికార్డు కలక్షన్స్ అందుకోవడంతో దిల్ రాజు అండ్ ఫ్యామిలీ చెన్నెలోని విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా దిల్ రాజు మనవరాలు ఇషికా రెడ్డి హీరో విజయ్ చంకనెక్కి కూర్చోవడం హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు ఏకైక కూతురు హన్షిత రెడ్డి కూతురు ఇషికా రెడ్డి. ఈ పార్టీలో విజయ్ ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. ఎంతో ముద్దుగా ఉన్న ఇషికా.. విజయ్ చంకన మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలను విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.