Varasudu: అయ్యా.. దిల్ రాజు.. తేడా కొట్టేసిందిగా
Did Dil Raju Get A Hit In The Movie Varasudu:సినీ అభిమానులకు సంక్రాంతి పండుగ ఎప్పుడో మొదలయ్యింది. అజిత్ తెగింపు తో మొదలైన ఈ సంక్రాంతి రేసు నేడు వారసుడు సినిమాతో కొనసాగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వరీసు. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమా కోసం దిల్ రాజు పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాలకృష్ణ, చిరంజీవి తో పోటీకి దింపాలనుకున్నాడు. కానీ, టాలీవుడ్ నిర్మాతల మండలి ఒత్తిడి వలన దిల్ రాజు వెనక్కి తగ్గాడు. ఇక జనవరి 11 న ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకుంది. అక్కడ విజయ్ రేంజ్ ను బట్టి పర్లేదు అనిపించింది.
ఇక ఈ సినిమా ఈరోజు తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా చూసిన వారు మాత్రం వారసుడు పాత చింతకాయ పచ్చడినే చూపించారు. వంశీ.. నాలుగు ఐదు పాత సినిమాలను మిక్స్ చేసి విజయ్ తో యాక్షన్ సీన్స్ చేసి వారసుడు మూవీని రిలీజ్ చేశాడు. ఇలాంటి సినిమా సాంబార్ తంబీలు చూడలేదేమో.. తెలుగులో మస్త్ చూసేసాం. ఇంతోటి సినిమా కోసం దిల్ రాజు అంత కష్టపడ్డాడు. అవసరమే లేదు.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ప్లాప్ అయ్యేది.. తమిళం లో ప్రయోగం చేయాలనుకున్న దిల్ రాజు కు ఇది ఒక గుణ పాఠం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.