Dhanush SIR Movie First Single Out: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ సార్.
Dhanush SIR Movie First Single Out: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్టారు.. మాస్టారు..` అంటూ సాగే లిరికల్ వీడియో ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
తిరుపతి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ అయిన తిలక్.. తన కొలీగ్ అయిన టీచ్ తో ప్రేమలో పడడం, అతడి గురించి టీచర్ అయిన సంయుక్త మీనన్ ప్రేమ భావాలను తెలుపుతున్నట్లు సాంగ్ ను బట్టి తెలుస్తోంది. రామ్ జో అందించిన పదాలు శ్రావ్యంగా వున్నాయి. జీవీ ప్రకాష్ సంగీతానికి అనుగుణంగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇక జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.