రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సామ్.. ఈ సినిమా చేస్తూనే ఇంకోపక్క సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కూడా నటిస్తోంది. ఇక సామ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు సెట్ లో జరిగే విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా సామ్.. ఖుషీ సెట్ లో విజయ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి షూటింగ్ గ్యాప్ లో లంచ్ డిన్నర్ పార్టీలకు బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ లంచ్ లోని ఒక ఫోటోనే షేర్ చేస్తూ ” మిమ్మల్ని మీరు బెస్ట్ గా చూసింది.. మిమ్మల్ని మీరు చెత్తగా చూసింది.. మిమ్మల్ని మీరు మొదట చూసింది.. మిమ్మల్ని మీరు చివరిగా చూసింది.. కొన్నిసార్లు మీ అల్పాలను చూసింది.. కొన్నిసార్లు మీ గరిష్టాన్ని చూసింది.. కొంతమంది స్నేహితులు నిత్యం ఎదుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం బాగా గడిచింది ” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ కమ్బో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.