బాలీవుడ్ లో హీరోయిన్ దీపికది ఎప్పుడూ అగ్రస్థానమే.
Deepika Padukone : బాలీవుడ్ లో హీరోయిన్ దీపికా పదుకొణెది టాప్ పొజిషన్. ఇటీవల షారూక్ ఖాన్ తో జత కట్టిన పఠాన్ చిత్రంలో మోతాదును మించిన అందాలను ఆరబోసి కుర్రకారు మతి పోగొట్టింది. తాజాగా నటుడు శింబుకు జంటగా దీపిక ఓ సినిమాలో నటించబోతోంది. శింబు నటించిన తాజా చిత్రం పత్తుతుల ఇటీవల తెరపైకి వచ్చి విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన 48 చిత్రానికి దీపికను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. దీనికి కన్నుమ్ కన్నుమ్ కోల్ లైయాడిత్తాల్ చిత్రం ఫేమ్ దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో హీరోయిన్గా దీపికా హీరోయిన్గా ఫైనల్ చేశారు. తాను శింబుతో నటించటానికి రెడీ అని చెప్పిన దీపిక పారితోషికం మాత్రం 30 కోట్లు కావాలని డిమాండ్ చేసిందట. దీంతో పాటు తాను షూటింగ్ కు వస్తే ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేస్తానని, ఆహోటల్లో బస చేస్తే ఆ అంతస్థు మొత్తం తనకే కేటాయించాలని కండిషన్ పెట్టిందట. దీంతో దీపిక షరతులకు సినిమా యూనిట్ కు షాకయ్యారట. దీంతో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. దీపిక షరతుల వార్త టాలీవుడ్లోనే కాదు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.