జబర్దస్త్ కమెడియన్ వేణును.. డైరెక్టర్ ను చేసిన సినిమా బలగం. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. అవార్డులు, రివార్డులు..
జబర్దస్త్ కమెడియన్ వేణును.. డైరెక్టర్ ను చేసిన సినిమా బలగం. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. అవార్డులు, రివార్డులు.. ప్రశంసలు.. ఒక్కటి అని చెప్పనవసరం లేదు.. అంతటి హిట్ అందుకున్న ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ పాడిన బలగం మొగిలయ్యకు కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ మధ్యనే బలగం మొగిలయ్య అనారోగ్యంతో హాస్పిటల్ లో చేర్పించిన విషయం తెల్సిందే. ఆయనకు సహాయం చేయాల్సిందిగా ఆయన భార్య ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇక వీరికి చిరంజీవి తో పాటు ప్రభుత్వం కూడా సాయం చేసింది. ప్రస్తుతం మొగిలయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మరింత సహాయం చేసింది.
పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును అందించారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. “దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులందరు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలు చేశామని, బలగం సినిమాలో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకున్న మొగిలయ్య, కొమురమ్మలకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. ముందు ముందు కూడా మొగిలయ్యకు ఎలాంటి అవసరం ఉన్నా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇక తమపై ఇంత ఆదరణ చూపిస్తున్నందుకు మొగిలయ్య దంపతులు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.