Vijayendra Prasad:బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి సంచలన చిత్రాలతో రచయితగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు విజయేంద్రప్రసాద్.
Vijayendra Prasad:బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి సంచలన చిత్రాలతో రచయితగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు విజయేంద్రప్రసాద్. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించిన ఆయన సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేయిస్తూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు.
వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా `డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ఉందని తెలిపారు. `ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు. నేనే స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో..అతి తక్కువ బడ్జెట్‌తో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక అద్భుతం క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యమైంది. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించి ఒక గొప్ప సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం అని తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
ఇది అందరికి ఉపయోగపడే నిర్మాణం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోందన్నారు. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నానని విజయేంద్ర ప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సచివాలయాన్ని సందర్శించిన సమయంలో విజయేంద్ర ప్రసాద్‌తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో- ఫౌండర్ రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, బీఆర్ ఎస్ ఎంపి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
విజయేంద్ర ప్రసాద్ త్వరలో సెట్స్ పైకి రానున్న మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్‌కు కథ అందిస్తున్న విషయం తెలిసిదే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను రాజమౌళి తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.