The Warrior: దారుణంగా పడిపోయిన ‘ది వారియర్’ కలెక్షన్లు
‘The Warrior’ Box office collections: ఇస్మార్ట్ శంకర్ మాస్ పాత్ర తర్వాత రామ్ పోతినేని మరోసారి మాస్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’ రామ్ తన కెరీర్లోనే తొలిసారి ఓ పోలీస్ క్యారెక్టర్లో ఎంతో ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. అంచనాలకు తగినట్లే తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో ఈ మూవీ ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకుపైగా షేర్ సాధించింది.
అయితే ఈ సినిమాకు తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. జులై 14 న ఈ మూవీ రిలీజ్ కాగా.. శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా ఫస్ట్ వీకెండ్ అందరూ కలెక్షన్లపై ఆశలు పెట్టుకుంటారు. కానీ ది వారియర్ మాత్రం రామ్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు.
రెండో రోజే ఈ సినిమా కలెక్షన్లు 50 శాతం పడిపోవడం గమనార్హం. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాగా ఇక మొత్తం సర్దుకుంటుంది… అనే టైమ్ లో రెండో రోజైన శుక్రవారం అది రూ.6.35 కోట్లకు పడిపోయి కొంత నిరాశకు గురిచేసింది.ఇక మూడోరోజైన శనివారం రూ.4.35 కోట్లకు పరిమితమైంది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రూ.6.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఆ లెక్కన మొత్తం 4 రోజులు కలిపి ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.29 కోట్లు మాత్రమే.
ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.18.5 కోట్లు ‘ది వారియర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.38.1 కోట్ల బిజినెస్ చేసింది. ఆ లెక్కన బ్రేక్ఈవెన్ అందుకోవడానికి మరో రూ.20 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంది.ఇప్పుడున్న టైమ్ లో ఇది ఈ చిత్రానికి సాధ్యమేనా అంటున్నారు.సినీ వర్గీయులు.