waltair veerayya: విశాఖ చేరుకున్న మెగాస్టార్ – వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్
waltair veerayya Pre release function in AU engineering College grounds
విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. మెగాస్టార్ సినిమా వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. లక్షలాది మంది అభిమానులు చిరంజీవిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ కూడా విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చిరంజీవితో పాటు వాల్తేరు వీరయ్య చిత్ర బృందం కూడా విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నోవాటల్ హోటల్ చేరుకున్నారు. విశాఖ చేరిన చిరంజీవికి అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు.
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం ముస్తాబయింది. శరవేగంగా పనులు పూర్తి చేశారు. ఆర్కే బీచ్ వద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేద్దామని నిర్వాహకులు మొదట అనుకున్నారు. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో హుటాహుటిన ఫంక్షన్ వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. చివరిగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో సభను నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించారు. ఊర్వసి రౌటేలా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరుపులు మెరిపించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Hello #Waltair
Let’s meet today evening at the AU Engineering college grounds – Vizag for the #WaltairVeerayyaPreReleaseEvent
6 pm onwards #WaltairVeerayyaOnJan13th
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 8, 2023