Waltair Veerayya: థియేటర్లలో వీరయ్య పూనకాలు
Waltair Veerayya: సంక్రాంతి పండుగను మెగా ఫాన్స్ ఒకరోజుముందే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అభిమానులను అలరించడానికి.. మరింత రెట్టింపు ఉత్సహంతో థియేటర్లలో సందడి చేయడానికివచ్చాడు ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల నడుమ విడుదలైంది. రాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ మూవీ యూనిట్ ఉదయం 4 గంటలకే సినిమా వీక్షించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో స్పెషల్ షోకి దర్శకుడు బాబీతో పాటు, దేవీశ్రీ ప్రసాద్, చిరంజీవి కుమార్తెలు శ్రీజ,శుష్మిత ఈ ప్రత్యేక షో ను వీక్షించారు. వీరికి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు.
సుమారు 22 ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు చిరు-రవితేజ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మెగా అభిమానులను అలరించింది. ఇక ఈరోజు ఫాన్స్ అందరికి థియేటర్లలో పూనకాలు రావచ్చేమో. దాదాపుగా చిరంజీవి 20 ఏళ్ళతరువాత మాస్ సినిమా చేసాడు.ముఠామేస్త్రి,ఘరానా మొగుడు,లాంటి మాస్ సినిమాల తో అలరించిన బాస్ నేడు మరో మాస్ ఎలివేషన్ మూవీతో అభిమానులముందుకు వచ్చాడు.
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో చిరు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్‌లో ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. మెగా స్టార్ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఇక అమెరికాలోను ఇదే పరిస్థితి నెలకొంది. ఈరోజునుండి మరో రెండు రోజలవరకు థియేటర్ల వద్ద వాతావరణం ఇలాగె ఉండబోతుందని థియేటర్ల యాజమాన్యాలు చెపుతున్నాయి.