Waltair Veerayya: అమెరికాలో వీరయ్య పూనకాలు
Waltair Veerayya:తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వాల్తేరు వీరయ్య సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఉదయం 4 గంటలనుండే షోలు పడిపోయాయి. దీంతో చిరు ఫ్యాన్స్ సినిమా టాకీస్‌ల వద్ద హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది. అలాగే అమెరికాలో కూడా 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. దీంతో అమెరికా అంతటా మెగా ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
అమెరికా అంతటా థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ ఒక రేంజిలో సంబరాలు చేసుకుంటున్నారు. జై చిరంజీవి, స్టార్.. స్టార్ మెగా స్టార్ అన్న నినాదాలతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోతున్నాయి. ఇక అక్కడే ఉన్న ‘ఆర్ఆర్ ఆర్’ టీమ్ అమెరికా లోనే సినిమాను చూసింది. ఇక రాంచరణ్-ఉపాసన సైతం ఈచిత్రాన్ని అమెరికాలోనే వీక్షించారు. అమెరికాలో శ్లోకా ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. చిరంజీవి లుంగీ కట్టి రంగు రంగుల చొక్కాలు వేయడంతో మెగాభిమానులు సంబరాలలో మునిగితేలుతున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు విపరీతమైన స్పందన వస్తోంది. నిజంగానే థియేటర్ లో అభిమానులకు పూనకాలు రప్పిస్తోంది. ఈ సినిమా. చిరు స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పేపర్స్, పూలు స్క్రీన్స్ పై వేస్తూ ఫ్యాన్స్ బాగా హంగామా చేశారు. ఈలలు వేస్తూ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అరుపులు, కేకలతో థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతున్నాయి.