Waltair Veerayya: వాల్తేరు వీరయ్య దెబ్బకు బాక్సాఫీస్ షేక్
Waltair Veerayya: సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు మంచి ట్రీట్ ఇచ్చారు. చిరంజీవి మాస్ సినిమా చేసి చాలారోజులైంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’ గా మరోసారి ఊర మాస్ లెవల్లో చూపించాడు. వింటేజ్ లుక్ లో చిరంజీవి ఆ పాత రోజులను గుర్తుకు తెచ్చాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్కింది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ రిలీజైన అన్ని థియేటర్ల ముందట హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసారు.
చాలా చోట్ల ‘వాల్తేరు వీరయ్య’ రికార్డులమోత మోగిస్తుంది. విడుదలైన మూడురోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి దూసుకెళ్లింది. రికార్డుల వేట కొనసాగుతోంది ముఖ్యంగా చాలా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో మరోసారి తనదైన కామెడీతో అలరించాడు. చిరంజీవి కి జోడిగా శృతిహాసన్ నటించగా. మాస్ మహారాజ రవితేజ పవర్ ఫుల్ రోల్లో నటించాడు.
ఇక ఈ సినిమా రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతుంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 157 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు రాష్టాలలో అయితే 120 కోట్లను దాటి వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. చిరంజీవి కమర్షియల్ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి రుజువైంది. ఇక ఈ కొత్తసంవత్సరంలో బాస్ నటించిన సినిమా ఇంతపెద్ద విజయం సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.