పవర్ ఫుల్ లాయర్ గా మాస్ కా దాస్.. ఎందులోనంటే..?
వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపి ఆశ్చర్యానికి గురిచేశారు.
నేడు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా.. అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ చిత్రంలో విశ్వక్ పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్నాడు. విశ్వక్ కనిపించేది కొద్దిసేపే అయినా ఆ పాత్ర ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉండనున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక మూవీ టీమ్ లో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో “ముఖచిత్రం” సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.