Varasudu: విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘రంజితమే’ సాంగ్ ని మేకర్స్ విడుదల చేసారు. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘వారసుడు’. తెలుగు , తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ మూవీ పై విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సాంగ్ లో విజయ్ తలపతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టాడని చెప్పొచ్చు.
ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా ఫస్ట్ టైమ్ రష్మిక అలరించనుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ నటించిన గత చిత్రం పరాజయం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో విజయ్ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.