‘సర్కారు వారి పాట’ బాగుంది.. విజయసాయి ప్రసంసలు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సర్కారు వారి పాట. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. అభిమానులైతే సినిమా అద్భుతంగా ఉందని అంటుంటే మరికొందరు మాత్రం సినిమా యావరేజ్ గా ఉందని అంటున్నారు.. మొత్తం మీద సినిమా హిట్టా ఫ్లాపా అనేది కలెక్షన్లు నిర్ణయిస్తాయి. కానీ ఈ సినిమా మీద ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. సాధారణంగా ఇలా సినిమాలను అభినందిస్తూ ఎప్పుడూ స్పందించని ఆయన ఈ సినిమా బాగుందంటూ రాసుకు రావడం ఆసక్తికరంగా మారింది. ”సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.” అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేట్లు పెంచి సహకరించిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, అలాగే మహేష్ బాబు చిన్న జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
All the best to #MaheshBabu #wishes #greetings.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022