Vijay Devarkonda : రెండు చోట్ల ‘లైగర్’ ట్రైలర్ వేడుకలు
Liger Trailer To Be Launched In Two Cities : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లైగర్’ సాలా క్రాస్ బీడ్ అనేది టాగ్ లైన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ లు, వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఇటీవల సినిమాలో రిలీజ్ అయిన పాటలు కూడా సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ తో పాటు అనేక లైకులు సాధించడం జరిగింది.
ఈనెల 21వ తేదీన ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం భారీ లెవల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా జులై 21వ తేదీన ఉదయం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ నందు ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ముంబైలో సినీ పోల్స్ లో సాయంత్రం ఏడున్నర గంటలకు హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారట.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.కొన్ని రోజులుగా సక్సెస్ లేని విజయ్ ‘లైగర్’ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆగస్టు 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలపై సినిమా యూనిట్ భారీగా ఫోకస్ పెడుతున్నారు.