ఎట్టకేలకు ‘జనగణమణ’ను పట్టాలెక్కించిన పూరి.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
చిత్ర పరిశ్రమలో మరో బిగ్ పాన్ ఇండియా మూవీ మొదలైపోయింది. ఎన్నో ఏళ్లుగా అభిమానుల్లో మెదులుతున్న అనుమానాలకు పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమణ కు సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్ ని ప్రకటించేశాడు. గతంలో వినిపించినట్టుగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండతోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ముంబైలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. ఈ భారీ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ పైడిపల్లి, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు.
గగనతలంలో భారతీయ సైనికులు స్కై డైవ్ చేసినట్టు కనిపిస్తోంది. అలాగే జవాన్స్ బ్యాక్ డ్రాప్‌లో ఇండియా మ్యాప్‌తో అదిరిపోయేలా ఉంది ఈ పోస్టర్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్ నెలలో ప్రారంభించబోతున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు పూరి. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో జనగణమన చేస్తున్నాడు. మరి విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో వస్తున్న ఈ రెండో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.