బిచ్చగాడు(Bichchagadu) మూవీతో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోని(Vijay Antony) ఇంట విషాదం జరిగింది. 16 ఏళ్ల విజయ్ కూతురు మీరా(Meera) ఆత్మహత్య చేసుకుంది.
Vijay Antony : బిచ్చగాడు(Bichchagadu) మూవీతో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోని(Vijay Antony) ఇంట విషాదం జరిగింది. 16 ఏళ్ల విజయ్ కూతురు మీరా(Meera) ఆత్మహత్య చేసుకుంది. చెన్నై(Chennai)లోని చర్చి పార్క్ కాలేజ్(Church Park College)లో విజయ్ కూతురు మీరా.. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోంది.
ఏం జరిగిందో కారణం తెలియదు కానీ.. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు మీరా(Meera ) తన గదిలోని సీలింగ్ ఫ్యాన్(ceiling fan)కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమని అందరూ భావిస్తున్నారు. విజయ్ ఫ్యామిలీ చెన్నైలోని టీటీకే రోడ్డులో నివాసముంటోంది.
హీరో విజయ్ ఆంటోని, ఫాతిమా దంపతులకు మీరా పెద్ద కూతురు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో.. విజయ్ ఆంటోని కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే మీరా (Meera )మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు ఇప్పటి వరకూ విజయ్ ఆంటోని తన కూతురి మృతిపై స్పందించలేదు. అటు విజయ్ ఆంటోని కూతురు మీరా మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులుతో పాటు అభిమానులు కూడా మీరా మృతికి సంతాపం తెలియజేస్తూ.. విజయ్ ఆంటోనికి సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్నారు.