Vijay Antony Injured: విజయ్ అంటోనీకి తీవ్ర గాయాలు.. అసలు ఏమైందంటే?
Vijay Antony Injured: తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గతంలో బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోని తర్వాత చేస్తున్న తమిళ సినిమాలు దాదాపుగా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన బిచ్చగాడు 2 అనే సినిమా చేస్తున్నాడు. బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలోని ఒక దీవి దగ్గరలో జరుగుతోంది. వాటర్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా విజయ్ ఆంటోని నడుపుతున్న బోటు కెమెరామెన్ సహా ఇతర యూనిట్ సభ్యులు ఉన్న బోటుని ఢీ కొట్టిందని దీంతో విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలయ్యాయి అని తెలుస్తోంద. అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అక్కడి నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని అయినా ముందు జాగ్రత్తగా ఆయన కుటుంబ సభ్యులను మలేషియా పిలిపించామని యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఇక ఈ సినిమాతో ఆయన దర్శకుడుగా మారుతున్నారు. ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించడమే కాక తానే స్వయంగా నిర్మిస్తూ సంగీతం కూడా అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ ఆంటోని తర్వాతి కాలంలో నటుడిగా మారి హీరోగా నిలదొక్కుకున్నారు.