Victory Venkatesh remembers Sr NTR on his 100 years celebrations
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్లో సినీ పరిశ్రమ నుంచి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.
ఎన్టీఆర్తో నటించక పోవడం తీరని నాకు లోటు – వెంకటేశ్
తెలుగు జాతికి, తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని విక్టరీ వెంకటేష్ అన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదని హీరో వెంకటేశ్ అన్నారు. నేను తెలుగు వాడిని అని చెబుతానని… అలా చెప్పేందుకు గర్వ పడుతానని వెంకటేశ్ అన్నారు. ఆ గర్వం పేరే ఎన్టీఆర్. ఎన్టీఆర్తో నటించక పోవడం తీరని నాకు లోటు అని వెంకటేశ్ తన బాధను వ్యక్తం చేశారు. రాముడు భీముడు లాంటి గొప్ప సినిమా మా సంస్థకు అందించారని గుర్తుచేసుకున్నారు.
ప్రజల గుండెల మీద సంతకాలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్
తెలుగు ప్రజల గుండెల మీద సంతకాలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. తన హిట్ సినిమా పటాస్ ఎన్టీఆర్ బ్యానర్లో చేయడం నా అదృష్టం అని అనిల్ రావిపూడి అన్నారు.
ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి – ఆర్. నారాయణమూర్తి
కాలానికి ఎదురెల్లే ధీరోదత్తుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ అని నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ అని కొనియాడారు. రాజ్ కుమార్, శివాజీ గణేష్, దిలీప్ కుమార్ అందరు మంచి నటులే కానీ..
అన్ని వేశాల్లో ప్రజలను ఒప్పించి మెప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని నారాయణమూర్తి అన్నారు. అందుకే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు ఎన్టీఆర్ అని నారాయణ్ మూర్తి అన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వక పోవడం అన్యాయం, కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.