Venkatesh Multistarrer:శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రవితేజ ,వెంకటేష్ ?
Venkatesh and Ravi Teja Multi starrer Movie:చలన చిత్ర పరిశ్రమలో ఒక్కపుడు మల్టీస్టారర్ సినిమాల జోరు నడిచింది కొద్దిరోజులతర్వాత సోలో హీరో ట్రెండ్ వచ్చింది.ఈ ట్రెండ్ దాదాపు రెండు రెండుదశాబ్ధాలపాటు కొనసాగింది.ఆ తర్వాత మెల్లి మెల్లిగా టాలీవుడ్ లో టాలీవుడ్ లో మల్టీస్టారర్‌లు మొదలైయ్యాయి.మల్టి స్టారర్ కుదరడం అంత సులభం కాదు. కొన్ని కుదిరినట్లే కుదిరి నిరాశపరుస్తాయి.
ఈ మల్టి స్టారర్ చిత్రాలకు నాంది పలికాడు వెంకటేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో మహేష్ బాబు తో నటించి సినీప్రముఖులచే నీరాజనాలు అందుకున్నాడు.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు.వెంకటేష్ ఇలాంటి సినిమాలకు సై అంటున్నాడు. పవన్ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’, శ్రీకాంత్‌తో ‘షాడో’, రామ్ తో మసాలా, నాగచైతన్యతో ‘వెంకీ మామా’ వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాలు చేసి టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సృష్టించాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు వెంకటేష్. మరియు రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.ఇప్పుడు వెంకీ మరో మల్టి స్టారర్ ఓకే చేసాడని సమాచారం.ఈ స్టోరీ ని వెంకటేష్ కి శ్రీకాంత్ చెప్పాడని అందుకు వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. మరో హీరో రవితేజకు కథ చెప్పడానికి రెడీ అవుతున్నాడంట శ్రీకాంత్ అడ్డాల. రవితేజ కి కూడా కూడా కథ నచ్చి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వెంకీ రవితేజ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు .