Venkatesh: యంగ్ డైరెక్టర్ తో వెంకీ 75 వ చిత్రం
Venkatesh: విక్టరీ వెంకటేష్ ఎఫ్2 , నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కొత్త దర్శకులకు అవకాశమిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు వెంకటేష్. ఇటీవలే ‘హిట్ 2’ తో భారీ హిట్‌ని అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ చిత్రాన్ని ప్రకటించాడు. శైలేష్ కొలను ఇంతకుముందే నాని హీరోతో ‘హిట్ 3’ ప్రకటించారు. ఇప్పుడు వెంకీ ప్రాజెక్ట్ ‘హిట్ 3’ తర్వాతనా లేక ఆ ప్రాజెక్ట్ రావడానికి ముందే కంప్లీట్ చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
శైలేష్ కొలను డైరెక్షన్లో నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ యాక్షన్ మూవీ అనౌన్స్ మెంట్ తోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరి 25 న పెద్ద అప్డేట్ వస్తుందని కి మేకర్స్ ప్రకటించారు. ప్రకటించిన దానికంటే ముందే వెంకీ ప్రీ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇంతకుముందు తరుణ్ భాస్కర్ తో వెంకీ మూవీ ఉంటుందంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. వెంకీ మాత్రం శైలేష్ కొలనుకు అవకాశం ఇచ్చారు. ఇక ఈ ‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించబోతుందని సమాచారం. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియననున్నాయి.
Here comes the BLAST of an Update 🔥
Extremely Proud & Privileged to announce that, Our Prestigious 𝑷𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒊𝒐𝒏 𝑵𝑶 2 is Victory @VenkyMama’s Land Mark Film #Venky75 💥💥
Directed by @KolanuSailesh
Produced by @vboyanapalliAnnouncement on JAN 25th 2023❤️🔥 pic.twitter.com/EL3T4c78g8
— Niharika Entertainment (@NiharikaEnt) January 23, 2023