Venkatesh Maha: నేను నా మాటలను వెనక్కి తీసుకోవడం లేదు.. కానీ,
Venkatesh Maha Responds On Trolls: నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనడం ఎందుకు.. ట్రోల్ అయ్యాకా సారీ చెప్పడం ఎందుకు అని అంటున్నారు నెటిజన్స్. గత రెండు రోజుల నుంచి డైరెక్టర్ వెంకటేష్ మహాను నెటిజన్లు ఆడేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కేజీఎఫ్ సినిమాపై దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెల్సిందే. నీచ్ కమిన్ కుత్తే అంటూ అసభ్యమైన పదజాలం ఉపయోగించాడు. డైరెక్టర్ వెంకటేష్ మహాతోపాటు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిగతా దర్శకులపై కూడా ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక ఈ విషయంలో దర్శకుడు మరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను మాట్లిడిన దాంట్లో తప్పేమి లేదు కానీ, అలాంటి భాషలో మాట్లాడడం తప్పే.. అందుకు క్షమాపణ కోరుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
గత 24 గంటల్లో జరిగిన దానికి ఫాన్స్ వ్యక్త పరుస్తున్న ఎమోషన్ ను నేను అర్థం చేసుకోగలను గౌరవిస్తాను. మీరు చూసింది కేవలం రెండు నిమిషాల క్లిప్ మాత్రమే. కానీ ఆ ఇంటర్వ్యూలో ఉన్న నాతోటి దర్శకులను కూడా ట్రోల్స్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నా అభిప్రాయంపై వాళ్లు ట్రోల్స్ ఎదుర్కోవడం సరికాదు. వాళ్లు తెలుగు ఇండస్ట్రీలోనే చాలా గొప్ప దర్శకులు అని వెంకటేష్ మహా వివరణ ఇచ్చాడు.అయినా అభిమానులు మాత్రం వదలడం లేదు. నువ్వు మాట్లాడే విధానానికి సారీ చెప్తున్నావ్ .. నీ సినిమాలపై ఇదే విధంగా ఎవరైనా అంటే నువ్వు ఉరుకుంటావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.