Chiranjeevi-Balakrishna: అగ్రహీరోల తొలిరోజు కలెక్షన్స్ ఎంత..?
Chiranjeevi-Balakrishna: చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా తొలి రోజు యాభై కోట్ల మార్కును క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి. మొదటి రోజే ఈ సినిమా యాభై కోట్ల మార్కు క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరు కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. బాలయ్య కెరీర్ లో ఇది అధికం. దీంతో బాలకృష్ణకు వీరసింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అయితే సినిమాకు తొలి రోజు మిశ్రమ స్పందన రావడం మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవడంతో రెండో రోజు వీరసింహారెడ్డి కలెక్షన్ భారీగా తగ్గిపోయింది. ఇక అమెరికా లో ‘వాల్తేరు వీరయ్య’ మొదటి రోజే ఒకమిలియన్ కి పైగా అమెరికన్ డాలర్లను వసూల్ చేసింది.
వీరసింహారెడ్డి నైజాం ఏరియాలో 7.50 కోట్లు, సీడెడ్‌లో 5.70 కోట్లు కలెక్షన్స్ దక్కించుకున్నది. చిరంజీవి సినిమాకు ఈస్ట్‌లో 3.80 కోట్లు, వెస్ట్‌లో మూడు కోట్ల పది లక్షలు, గుంటూర్‌లో 2.75 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్‌సీస్‌లో 7.25 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఇతర రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల వరకు వాల్తేర్ వీరయ్య వసూళ్లను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వీరసింహారెడ్డి తొలిరోజున 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం అయితే రెండో రోజు ఆ షేర్ విలువ అమాంతం 5 కోట్లకు పడిపోయింది. బాలయ్య సినిమాకు భారీగా థియేటర్లు తగ్గడం వల్ల ఇలా జరిగిందా లేక కంటెంట్ రొటీన్ గా ఉండడం వల్ల ఇలా జరిగిందా అనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ పండగ రోజుల్లో వీరసింహారెడ్డి కలెక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు వాల్తేరు వీరయ్య రెండవరోజుకూడా భారీ వసూళ్లను అందుకుంది.