Veera Simha Reddy : అమెరికాలో వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శన నిలిపివేత
వీరసింహారెడ్డి సినిమా థియేటర్ల వద్ద బాలయ్య బాబు అభిమానుల సందడి మాములుగా లేదు. ఉదయానే షోలు మొదలవడంతో బాలయ్య అభిమానులు పోస్టర్‌కు రక్తాభిషేకం చేసి అత్యుత్సహం ప్రదర్శించారు. అనంతరం జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసుల కు అభిమానులకు మధ్య కొంత తోపులాట జరిగింది.
ఇక అమెరికాలోని వర్జీనియాలో వీరసింహా రెడ్డి సినిమా ఆడుతోన్నఓథియేటర్‌లో అభిమానులు అత్యుత్సహం ప్రదర్శించారు. మూవీ స్టార్ట్ అయిన అనంతరం ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. థియేటర్‌లో హంగామా సృష్టించారు. పేపర్లు ఎగురేస్తూ థియేటర్ అంతా గోలగోల చేసారు.ఫాన్స్ ఉత్సహంతో పేపర్లు చించి హడావిడి చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసుల సహాయంతో అర్ధాంతరంగా షో నిలిపివేశారు.
థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామాను అడ్డుకున్నారు. థియేటర్‌లో ఇలాంటివి అంగీకరించేదిలేదంటూ హెచ్చరించారు. సినిమాను సినిమాలాగే చూడాలని ఇలా అత్యుత్సహాన్ని ప్రదర్శించకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా బాలయ్య అభిమానులను థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాలయ్య ఫ్యాన్స్ అమెరికాలోని కనాస్ పట్టణంలో కార్లతో రచ్చ చేశారు అభిమానులు. నెంబర్ ప్లేట్లపై బాలయ్య రాసి ఉన్న కార్లతో NBK ఆకారంలో కార్లను ఏర్పాటు చేశారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు..గోపీచంద్ మలినేని ట్వీట్ చేసాడు.
NBK’S #veerasimhareddy 🔥mania in Kansas City., USA on SUNDAY pic.twitter.com/fo4DpgiXJi
— Gopichandh Malineni (@megopichand) January 11, 2023